రాజకీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గిన జమ్మూకాశ్మీర్ గవర్నర్‌ను తక్షణం ఆ బాధ్యతల నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఇందుకోసం ఆ పార్టీ సోమవారం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర బంద్‌ను నిర్వహిస్తోంది. దీనిపై భాజపా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అశోక్ ఖజారియా మాట్లాడుతూ ఆలయ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.
అయితే అతివాదులు, రాజకీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గిన గవర్నర్, ఆలయ బోర్డు ఛైర్మన్ వోహ్రాను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కాశ్మీర్‌లోని ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరుతూ దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
కాగా, అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో గత వారం రోజులుగా కాశ్మీర్ లోయల్లో సాగిన హింసాత్మక సంఘటనలకు తెరపడ్డాయి. అమర్‌నాథ్ యాత్రికులకు ప్రభుత్వమే అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తుందని ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటించారు.
|