ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
36 మంది యాంటీ నక్సల్స్ స్క్వాడ్ గల్లంతు  Search similar articles
ఒరిస్సా-ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుల్లో ఆదివారం జరిగిన మావోయిస్టుల దాడిలో 36 మంది యాంటీ నక్సల్స్ బృందం పోలీసుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వీరి కోసం నావికాదళం గాలింపు చర్యలకు దిగింది. ఒరిస్సా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సీలేరు నది దాటుతున్న గ్రౌహౌండ్స్ దళాలపై మావోయిస్టులు ఆదివారం దాడికి పాల్పడిన విషయం తెల్సిందే.

నక్సలైట్ల కోసం కూంబింగ్ నిర్వహించిన అనంతరం తిరుగుముఖం పట్టిన పోలీసులపై కాపుకాసిన మావోయిస్టులు చావు దెబ్బ కొట్టారు. నదిని లాంచీలో దాటుతుండగా మావోయిస్టులు రాకెట్ లాంఛర్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో లాంచీ రెండు ముక్కలైంది. ఈ దాడిలో గ్రెహౌండ్స్ దళానికి చెందిన మరో ముగ్గరు సిబ్బంది తీవ్ర గాయాలతో నదిలోకి దూకినట్లు అధికారులు తెలిపారు. వీరు సాయంత్రానికి ఒడ్డుకు చేరుకున్నారు. వారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా భువనేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు దాడికి పాల్పడిన సమయంలో లాంచీలో 65 మంది గ్రేహౌండ్స్ సిబ్బంది ఉన్నారు. ఊహించని రీతిలో మావోయిస్టులు రాకెట్లతో దాడి చేయడం, ఎదురు దాడికి దిగే అవకాశం లేకుండా పోవడంతో గ్రేహౌండ్స్‌కు అపారనష్టం వాటిల్లింది.

ప్రాణాలు కాపాడుకోవడానికి నదిలో దూకిన వారిలో 25 మంది ఆదివారం మధ్యాహ్నానికి బయట పడ్డారు. మరో ముగ్గురు సాయంత్రానికి ఒడ్డుకు చేరుకున్నారు. ఇంకా 36 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు నావికాదళం రంగంలోకి దిగింది.
మరిన్ని
మెజారిటీని నిరూపించుకుంటా: అజాద్
మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
గవర్నర్ తొలగింపునకు భాజపా డిమాండ్
అసోంలో బాంబు పేలుడు : 5 మంది మృతి
మావోయిస్టుల దాడి : 50 మంది గల్లంతు
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు : ములాయం