ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమర్‌నాథ్‌ స్థలంపై ఆందోళన అనవసరం: రాజ్‌నాథ్  Search similar articles
అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు అనవసరమని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జస్పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయించడాన్ని ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదన్నారు.

ఇది అమర్‌నాథ్ యాత్రికులకు మేలు చేసినట్టేనని ఆయన అన్నారు. దీనిపై కొంతమంది అతివాదులు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయడం అనవసరమని ఆయన పేర్కొన్నారు. అమర్‌నాథ్ యాత్రికులకు మెరుగైన సౌకర్యాల రూపకల్పన కోసం తమ పార్టీ ఆందోళన కొనసాగిస్తుందని చెప్పారు.

భారత్-అమెరికా అణు ఒప్పందంపై ఆయన వ్యాఖ్యానిస్తూ ఒప్పందం అమలుకు వచ్చినా అణు పరీక్షలు నిర్వహించుకునే పూర్తి అధికారం భారత్‌కు ఉండాలన్నారు. ఈ అంశంలో అమెరికా జోక్యాన్ని సహించజాలమన్నారు. అణు ఒప్పందం అమలుపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తక్షణం ఒక నిర్ణయానికి రావాలని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని
36 మంది యాంటీ నక్సల్స్ స్క్వాడ్ గల్లంతు
మెజారిటీని నిరూపించుకుంటా: అజాద్
మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
గవర్నర్ తొలగింపునకు భాజపా డిమాండ్
అసోంలో బాంబు పేలుడు : 5 మంది మృతి
మావోయిస్టుల దాడి : 50 మంది గల్లంతు