ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
7న ఆజాద్‌కు విశ్వాసపరీక్ష: వోహ్రా ఆదేశం  Search similar articles
జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. వచ్చే ఏడో తేదీన సభలో బలం నిరూపించుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా ఆదేశించారు. అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జమ్ముకాశ్మీర్‌లో పెద్ద దుమారం చెలరేగిన విషయం తెల్సిందే.

దీంతో ఆజాద్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును పిడిపి ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వానికి పూర్తి బలం ఉందని, బల నిరూపణకు ఎపుడైనా
ఆజాద్‌ ప్రభుత్వకు ముప్పు
  అమర్‌నాథ్‌ ఆలయానికి భూముల కేటాయింపు నిర్ణయం జమ్ము ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టింది. పిడిపి మద్దతు ఉపసంహరించుకుంది. సీఎం ఆజాద్ మాత్రం పూర్తి మెజారిటీ ఉందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. 7న బలపరీక్షకు గవర్న్ ఆదేశించారు.      
సిద్ధమేనని ఆజాద్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్‌కు పంపిన వర్తమానంలో పేర్కొన్నట్టు సమాచారం. మొత్తం 87 మంది సభ్యులు కలిగిన సీఎం విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే 44 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి.


కాగా, సభలో కాంగ్రెస్‌కు 21 మంది సభ్యులు ఉన్నారు. అలాగే నేషనల్ కాన్ఫెరెన్స్‌కు 24, పీడీపీకి 18, పాంథర్స్ పార్టీకి 4, సీపీఎంకు రెండు, భాజపాకు ఒకటి, ఇతరులకు 8 స్థానాలు ఉన్నాయి. వీరిలో సీపీఎం, ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులతో సహా, పిడిపి మద్దతు ఇస్తోంది. వీరిలో పిడిపికి చెందిన 18 మంది సభ్యులు మద్దతును ఉపసంహరించుకోవడంతో జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది.

అయినప్పటికీ తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని ఆజాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా.. అసెంబ్లీ కాలపరిమితి మరో నాలుగు నెలలు మాత్రమే ఉంది. వచ్చే నవంబరు/డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటి వరకు ప్రభుత్వంలో కొనసాగుతామని ఆజాద్ ప్రకటించడం గమనార్హం.
మరిన్ని
పార్లమెంటులో దేనికైనా సిద్ధం: ప్రధాని
అమర్‌నాథ్‌ స్థలంపై ఆందోళన అనవసరం: రాజ్‌నాథ్
36 మంది యాంటీ నక్సల్స్ స్క్వాడ్ గల్లంతు
మెజారిటీని నిరూపించుకుంటా: అజాద్
మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
గవర్నర్ తొలగింపునకు భాజపా డిమాండ్