ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రణబ్‌తో ఎస్పీ నేత అమర్ సింగ్ భేటీ  Search similar articles
భారత్-అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందం వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారంలో ఆ పార్టీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ సోమవారం కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. అణు ఒప్పందాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎస్పీ నేతల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ముఖర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అణు ఒప్పంద ప్రయోజనాలతో పాటు, ప్రభుత్వ వైఖరిని అమర్‌సింగ్‌కు కేంద్ర మంత్రి వివరించారు. అలాగే అణు ఒప్పందం అమలుకు ముందుకు సాగనున్నట్టు ప్రణబ్ తేల్చి చెప్పినట్టు సమాచారం. అణు ఒప్పందం కారణంగా యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం లోక్‌సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనక తప్పదు.

ఈ పరిస్థితుల్లో 39 మంది సభ్యులు కలిగిన ఎస్పీ చక్రం తిప్పనుంది. ఇలాంటి తరుణంలో ప్రణబ్-సింగ్‌ల భేటీకి అత్యంత ప్రాధాన్యత సమకూరింది. ఇప్పటికే ఎస్పీ అధినేత ములాయం సింగ్ కాంగ్రెస్‌తో కరచాలనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు బలంగా వస్తున్న విషయం తెల్సిందే.
మరిన్ని
7న ఆజాద్‌కు విశ్వాసపరీక్ష: వోహ్రా ఆదేశం
పార్లమెంటులో దేనికైనా సిద్ధం: ప్రధాని
అమర్‌నాథ్‌ స్థలంపై ఆందోళన అనవసరం: రాజ్‌నాథ్
36 మంది యాంటీ నక్సల్స్ స్క్వాడ్ గల్లంతు
మెజారిటీని నిరూపించుకుంటా: అజాద్
మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర