ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాకపోకలను సాగించిన 176 మంది ప్రజలు  Search similar articles
జమ్ము కాశ్మీర్ సరిహద్దులోని చక్కన్ డా భాగ్ వద్ద 176 మంది ప్రజలు సరిహద్దులను దాటినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్ముకాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు సరిహద్దులను దాటి తమ బంధువులు నివశిస్తున్న ప్రాంతాలకు వెళ్లి, తిరిగి తమ ప్రాంతాలకు చేరుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

పూంఛ్‌లోని ఛక్కన్ డా బాగ్ వద్ద సరిహద్దును సోమవారం ఉదయం 10.30 గం నుంచి సాయంత్రం 18.15 వరకు తెరచి ఉంచినట్టు వర్గాలు వెల్లడించాయి. రెండు ప్రాంతాల వైపు రాకపోకలు సాగించిన వారిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన 86 మంది కాశ్మీర్ లోయల్లోకి వచ్చారని, వీరిలో 60 కొత్త సందర్శకులుగా ఉన్నారు.

అలాగే మరో 26 మంది భారతీయులు కూడా సరిహద్దులకు ఆవతల ఉన్న బంధువులను చూసి, తిరిగి తమ ప్రాంతాలకు చేరుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే మరో 90 మంది ప్రజలు పీఓకేలోకి వెళ్లారని తెలిపారు. వీరిలో 42 మంది జమ్ముకాశ్మీర్‌కు, మరో 48 మంది పీఓకే‌కు చెందిన వారని అధికార వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని
ప్రశాంతంగా సాగుతున్న అమర్‌నాథ్ యాత్ర
ప్రణబ్‌తో ఎస్పీ నేత అమర్ సింగ్ భేటీ
7న ఆజాద్‌కు విశ్వాసపరీక్ష: వోహ్రా ఆదేశం
పార్లమెంటులో దేనికైనా సిద్ధం: ప్రధాని
అమర్‌నాథ్‌ స్థలంపై ఆందోళన అనవసరం: రాజ్‌నాథ్
36 మంది యాంటీ నక్సల్స్ స్క్వాడ్ గల్లంతు