ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
3న 'భారత్‌ బంద్‌'కు వీహెచ్‌పీ పిలుపు  Search similar articles
అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూముల కేటాయింపు వ్యవహారంలో జరిగిన పరిణామాలకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పి) గురువారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు కాశ్మీర్‌లోని కొన్ని సంస్థలు మద్దతు ప్రకటించాయి. శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయిస్తూ జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.

దీనిపై కాశ్మీర్ లోయల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడమే కాకుండా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) జమ్ముకాశ్మీర్‌లోని కాంగ్రెస్ సంకీర్ణ సర్కారుకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ఈనెల ఏడో తేదీన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ వీఎన్.వోహ్రా ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కోరారు.

ఇదిలావుండగా, మంగళవారం సమావేశమైన ఆ రాష్ట్ర కేబినెట్ ఆలయ భూములను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ పరిస్థితుల్లో వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా మీడియాతో మాట్లాడుతూ.. భూముల కేటాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసే వారిని, లౌకిక విధానాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని ఆయన ఆరోపించారు.
మరిన్ని
'ఆరు'కు ముందే విడాకులు: లెఫ్ట్ వర్గాలు
'కర'చాలానికి చేరువలో ములాయం
సోనియాతో సమావేశమైన రైల్వే మంత్రి లాలూ
భారీ వర్షపు నీటిలో మునిగిన ముంబై
రాకపోకలను సాగించిన 176 మంది ప్రజలు
ప్రశాంతంగా సాగుతున్న అమర్‌నాథ్ యాత్ర