ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'జలగుండం'లో ముంబై: మరో 24 గంటలు వర్షాలు  Search similar articles
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం జలగుండాన్ని తలపిస్తోంది. నగరంలోని అనేక వీధులు, ప్రధాన రహదారులు, రైల్వే ట్రాకులు నీటిలో మునిగి పోయాయి. ముంబై నగర జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో నివశించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో ముంబై కార్పొరేషన్ సిబ్బంది నిమగ్నమైవుంది. అయినప్పటికీ మరో 24 గంటలు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు ప్రకటించారు.

మహారాష్ట్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ప్రత్యేకించి ముంబై, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల ధాటికి సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రహదారులన్నీ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ముంబైలోని పలు ప్రాంత్లాలో అడుగు నుంచి రెండు అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచివుంది. బాంద్రా, సియాన్‌, చెంబూర్‌, ఘట్కోపర్‌, అంధేరీ తదితర ప్రాంతాలు జలగుండాన్ని తలపిస్తున్నాయి.

రాయ్‌గఢ్‌, రాజ్‌కోట్‌, సూరత్‌, వల్సాద్‌, అమ్రేలి, భావ్‌నగర్‌ జిలాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు మార్గాల్లో సబర్బన్ రైళ్లను, పలు దూరప్రాంత రైలు సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ముంబైకు వస్తున్న పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నాయి.

అలాగే పలు అంతర్జాతీయ విమానాలు దాదాపు ఒకటి రెండు గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముంబై-పూణే జాతీయ రహదారి ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో వాహన రాకపోకలు స్తంభించాయి. అన్ని ప్రాంతాలు జలమయంకావడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ముంబై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని
3న 'భారత్‌ బంద్‌'కు వీహెచ్‌పీ పిలుపు
'ఆరు'కు ముందే విడాకులు: లెఫ్ట్ వర్గాలు
'కర'చాలానికి చేరువలో ములాయం
సోనియాతో సమావేశమైన రైల్వే మంత్రి లాలూ
భారీ వర్షపు నీటిలో మునిగిన ముంబై
రాకపోకలను సాగించిన 176 మంది ప్రజలు