ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నావికాదళం విస్తరణకు రక్షణ శాఖ యత్నాలు  Search similar articles
హిందూ మహాసముద్రం రానురానూ తీవ్ర సంఘర్షణలకు నిలయంగా మారుతున్న నేపథ్యంలో భారత నావికాదళం సామర్థ్యాన్ని విస్తరించాలని దేశ రక్షణ శాఖ నిర్ణయించింది. భారత ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ కోచ్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖ సహాయ మంత్రి ఎమ్ఎమ్ పల్లంరాజు ఈ విషయమై ప్రకటించారు.

హిందూమహాసముద్ర ప్రాంతంలో ఇతర దేశాల జలాంతర్గాములు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. మన పొరుగు దేశాల్లో కూడా నావికా బలగాలను విస్తరిస్తున్నారని దీనిపై మనం జాగరూకతతో ఉండవలసిన అవసరముందని మంత్రి చెప్పారు.

హిందూ మహాసముద్రంలో భారత్ ఉనికిని పటిష్టం చేసుకోవడంలో భాగంగా భారతీయ నావికా దళం సామర్థ్యాన్ని విస్తరించాలని రక్షణశాఖ నిర్ణయించిందని మంత్రి పల్లంరాజు తెలిపారు. చైనా, పాక్ తదితర దేశాలు తమ నావికా దళానికి పదును పెట్టుకుంటున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన రక్షణ శాఖ సహాయ మంత్రి, బహుళ సాంకేతిక జ్ఞానాలను అందిస్తున్న రక్షణశాఖ పరిశోధనా అభివృద్ధి సంస్థ -డిఆర్‌డిఓ-ను అభినందించారు.
మరిన్ని
అణు సార్వభౌమత్వానికి కీడు రాదు : పిఎంఒ
ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని పథకాల వర్షం
రేపు యూఎన్‌పీఏ కీలక సమావేశం
'జలగుండం'లో ముంబై: మరో 24 గంటలు వర్షాలు
3న 'భారత్‌ బంద్‌'కు వీహెచ్‌పీ పిలుపు
'ఆరు'కు ముందే విడాకులు: లెఫ్ట్ వర్గాలు