ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బిజెపి-విహెచ్‌పి బంద్ : స్తంభించిన జనజీవితం  Search similar articles
జమ్మూ-కాశ్మీర్‌లో అమరనాథ్ దేవాలయానికి కేటాయించిన భూముల కేటాయింపును ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, శివసేనల పిలుపు మేరకు గురువారం జరుగుతున్న దేశవ్యాప్త బంద్ కారణంగా దేశంలో పలు ప్రాంతాల్లో జనజీవితం స్తంభించిపోయింది.

బంద్ సందర్భంగా న్యూఢిల్లీ, ముంబై, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో నిరసన కారుల విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. ప్రధాన రహదారులు తాత్కాలికంగా దిగ్బంధనకు గురయ్యారు. ఢిల్లీలోని డిఎన్‌డి ఫ్లైవే, ముంబైలోని వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పాటు పలు రైళ్లు కూడా బంద్ తాకిడికి గురయ్యాయి. ఢిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఆగ్రా సమీపంలో బంద్ నిర్వాహకులు నిలిపివేశారు.

ఈ బంద్‌లో విహెచ్‌పి చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగా పరిషత్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అబ్డేవ్ మాట్లాడుతూ అమర్‌నాథ్ భూ బదలాయింపుకు సంబంధించి ప్రస్తావిస్తున్న అటవీ చట్టం కేవలం సాకుగా మాత్రమే ఉంటోందని ఆరోపించారు. అమర్‌నాథ్ యాత్రను అడ్డుకోవడానికి కుట్రలో భాగంగా ఈ వివాదాన్ని లేవనెత్తారని, రేపు విష్ణోదేవి, తిరుపతి ఆలయాలకు కూడా యాత్రికులు రాకుండా అడ్డుకోబోతారని వెంకటేష్ చెప్పారు.

ఈలోగా, జమ్మూలో గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. జాతీయ రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ పలుచోట్ల స్తంభించిపోయిందని వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి, ఎన్డీఎ పాలిత రాష్ట్రాల్లో బంద్ పటిష్టంగా జరుగుతోంది. పంజాబ్‌లో లూధియానా మరియు జలంధర్ నగల వీధుల్లో బిజెపి కార్యకర్తలు వీరంగం సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మూసివేశారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో బంద్ నిర్వాహకులు రాళ్లు విసిరి, రోడ్లను దిగ్బంధించివేశారు. ముంబైలోని కాడివిల్లి, వకోలా, మలాడ్, బోరివిలి, ఘట్కోపార్ వంటి పలు ప్రాంతాల్లో వందలాది మంది విహెచ్‌పి కార్యకర్తలు బస్సులపై రాళ్లు విసరడం, రోడ్లను దిగ్బంధనం చేయడం వంటి చర్యలకు పాల్పడగా పోలీసులు వారిని చెదరగొట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయిస్తూ జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీనిపై కాశ్మీర్ లోయల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడమే కాకుండా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) జమ్ముకాశ్మీర్‌లోని కాంగ్రెస్ సంకీర్ణ సర్కారుకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంది.

దీంతో ఈనెల ఏడో తేదీన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ వీఎన్.వోహ్రా ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కోరారు. ఇదిలావుండగా, మంగళవారం సమావేశమైన ఆ రాష్ట్ర కేబినెట్ ఆలయ భూములను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసే వారిని, లౌకిక విధానాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ఆరోపించడం తెలిసిన విషయమే.
మరిన్ని
నావికాదళం విస్తరణకు రక్షణ శాఖ యత్నాలు
అణు సార్వభౌమత్వానికి కీడు రాదు : పిఎంఒ
ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని పథకాల వర్షం
రేపు యూఎన్‌పీఏ కీలక సమావేశం
'జలగుండం'లో ముంబై: మరో 24 గంటలు వర్షాలు
3న 'భారత్‌ బంద్‌'కు వీహెచ్‌పీ పిలుపు