ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లారీల సమ్మె  Search similar articles
హైవే టోల్ టాక్స్, డీజెల్‌పై పన్ను విధింపుకు నిరసనగా దేశవ్యాప్తంగా మొదలైన రవాణా సమ్మె రెండవరోజు కూడా కొనసాగుతోంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సరకుల రవాణా స్తంభించిపోయింది. సమ్మెను కొనసాగించ దలిచామని, ప్రభుత్వం తమకు అనుకూలంగా స్పందించేవరకు సమ్మెను ఆపేది లేదని అఖిల భారత రవాణా సంఘం -ఎఐఎమ్‌టిసి- అధ్యక్షుడు చరణ్ సింగ్ లోహరా పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి బాలుతో అఖిల భారత రవాణా కార్మికుల సంఘం, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ప్రతినిధులతో జరిగిన చర్చలు సంతృప్తికరంగా ముగియకపోవడంతో సమ్మను కొనసాగించాలనే వారు నిర్ణయించారు. కాగా, సమ్మె ప్రారంభమైన తొలి రోజునే దేశవ్యాప్తంగా దాదాపు 85 శాతం సరుకు రవాణా వాహనాలు ఎక్కడి కక్కడే నిలిచిపోయాయని రవాణా సంఘం ప్రకటించింది.

కాగా తొలిరోజున సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 35 శాతం లారీలు మాత్రమే రోడ్డెక్కకుండా నిలిచిపోయాయని కేంద్ర రవాణా శాఖ అధికారులు చెప్పడం గమనార్హం.

దేశంలో 48 లక్షల ట్రక్కులు మరియు 20 లక్షల టెంపో ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎఐఎమ్‌టిసి... పెంచిన టోల్ టాక్స్‌ను వెనక్కు తీసుకోవాలని, 2004 సర్వీస్ టాక్స్ ఒప్పందాన్ని గౌరవించాలని, హైవేలలో వేగ నియంత్రణా పరికరాలను తొలగించాలని, డీజెల్‌పై పన్నును క్రమబద్దీకరించాలని డిమాండు చేస్తోంది.

కాగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ, లారీ యజమానులకు బ్రాండెడ్ కాని డీజెల్‌ను సాధారణ ధరలకే అందుబాటులో ఉంచుతున్నామని హమీ ఇచ్చింది. బుధవారం రవాణా సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపిన కేంద్ర రవాణా శాఖ మంత్రి టిఆర్ బాలు మాట్లాడుతూ, పార్లమెంటులో చట్టం ద్వారా ధరలు పెంపు నిర్ణయం జరిగినందున టోల్ టాక్స్ పెంపును వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

తొలిరోజు ఆందోళనకారులు కేంద్ర రవాణా శాఖ అధికారులతో రెండు సార్లు భేటీ అయ్యారు. అలాగే ఆర్థికమంత్రిత్వ శాఖతోనూ సమావేశమయ్యారు. అయితే చర్చలు ఫలప్రదం కాకపోవడంతో సమ్మెను కొనసాగించాలని రవాణా కార్మికుల సంఘం నిర్ణయించింది.
మరిన్ని
ప్రకాశ్ కారత్‌తో చంద్రబాబు భేటీ!
బిజెపి-విహెచ్‌పి బంద్ : స్తంభించిన జనజీవితం
నావికాదళం విస్తరణకు రక్షణ శాఖ యత్నాలు
అణు సార్వభౌమత్వానికి కీడు రాదు : పిఎంఒ
ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని పథకాల వర్షం
రేపు యూఎన్‌పీఏ కీలక సమావేశం