ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బీజేపీ బంద్ హింసాత్మకం : ఇద్దరి మృతి  Search similar articles
జమ్మూ-కాశ్మీర్‌లో అమరనాథ్ దేవాలయానికి కేటాయించిన భూముల కేటాయింపును ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా గురువారం జరుగుతున్న దేశవ్యాప్త బంద్ హింసాత్మకంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇద్దరు వ్యక్తులను ఈ బంద్ బలిగొంది. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ కార్యకర్తలు వీధుల్లో స్వైరవీహారం చేశారు. కత్తులు, కత్తులు వంటి ఇతరత్రా ఆయుధాలతో వాహనాలపై దాడికి దిగారు.

ఈ దాడిలో పలు బస్సులు, కార్లు ధ్వంసమయ్యాయి. అడ్డువచ్చిన వ్యక్తులపై కూడా దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకుగానూ బోపాల్‌లో పోలీసులు కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చినట్లు అధికారులు మీడియా ప్రతినిధులకు తెలిపారు.

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సింగ్ చౌహాన్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారికి పరిహారం చెల్లిస్తామని, దాడులకు పాల్పడ్డ వారిని అరెస్టు చేస్తామని చౌహాన్ వెల్లడించారు.

మరోవైపు బీజేపీ కార్యకర్తల దాడితో ఉద్రిక్తత చోటు చేసుకోవడంపై విపక్షాలు ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బంద్ సందర్భంగా న్యూఢిల్లీ, ముంబై, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో నిరసన కారుల విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. ప్రధాన రహదారులు తాత్కాలికంగా దిగ్బంధనకు గురయ్యారు.

ఢిల్లీలోని డిఎన్‌డి ఫ్లైవే, ముంబైలోని వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పాటు పలు రైళ్లు కూడా బంద్ తాకిడికి గురయ్యాయి. ఢిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఆగ్రా సమీపంలో బంద్ నిర్వాహకులు నిలిపివేశారు.
మరిన్ని
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లారీల సమ్మె
ప్రకాశ్ కారత్‌తో చంద్రబాబు భేటీ!
బిజెపి-విహెచ్‌పి బంద్ : స్తంభించిన జనజీవితం
నావికాదళం విస్తరణకు రక్షణ శాఖ యత్నాలు
అణు సార్వభౌమత్వానికి కీడు రాదు : పిఎంఒ
ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని పథకాల వర్షం