తన ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి. ఆయన మాత్రం గంభీరంగా కనిపించారు. నిర్ణీత సమయం కంటే ముందుగానే ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తూ పార్లమెంట్ ప్రాంగణానికి వచ్చారు. ఆయన కోసం మీడియా ప్రతినిధులు ఎంతో సేపుగా వేసి చూస్తున్నారు. అయినప్పటికీ ఆయన మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా విజయ సంకేతాన్ని చూపిస్తూ ఫోటోలకు ఫోజు మాత్రమే ఇచ్చారు. ఆయనే ప్రధాని మన్మోహన్ సింగ్.
చిరుదరహాసంతో లోక్‌సభకు వచ్చిన ఆయన ఫోటోలకు ఫోజు ఇచ్చి నేరుగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. అణు ఒప్పందంలో మనస్పర్ధల కారణంగా కామ్రేడ్లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెల్సిందే. ఇలాంటి పరిస్థితులలో ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారు.
75 యేళ్ళ మన్మోహన్ మంగళవారం సభలో విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. సోమవారం ప్రారంభమైన రెండు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అణు ఒప్పందంపై తీవ్రస్థాయిలో సాగుతోంది. విశ్వాస పరీక్షపై మంగళవారం సాయంత్రం ఓటింగ్ జరుగనుంది. అంతకుముందు సాయంత్రం 4.30 గంటలకు ప్రభుత్వాధినేతగా ప్రధాని కీలక ప్రసంగం చేయనున్నారు.
|