ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆరుగురు ఎంపీలకు ప్రత్యేక సెలవులు మంజూరు  Search similar articles
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ విశ్వాస పరీక్షా సమయం మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ మెజారిటీకి అవసరమైన సంఖ్యను యూపీఏ సంకీర్ణ కూటమి మరింత దగ్గరవుతోంది. దీనికి యూపీఏ వ్యతిరేక కూటమి సభ్యులే పరోక్షంగా సహకరిస్తున్నారు. అనారోగ్యంపాలై వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న సభ్యులు పలువురు తాము సభకు హాజరుకాలేమని, అందువల్ల సెలవులు మంజూరు చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు.

వారి విజ్ఞప్తి మేరకు ఆరుగురు సభ్యులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేసినట్టు సభాపతి సోమనాథ్ ఛటర్జీ సభలో ప్రకటించారు. అయితే సెలవులు కోరిన సభ్యుల పేర్లు మాత్రం వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాగా, వీరిలో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి చెందిన వారే ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ ఆరుగురు సభ్యులలో ఒకరు మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి కూడా ఉన్నట్టు సమాచారం.

మొత్తంమీద ఎన్డీయే కూటమికి చెందిన పలువురు సభ్యులు ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు లోపాయకారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. వీటిని అటు భాజపా, ఇటు కాంగ్రెస్ పార్టీలు తోసిపుచ్చాయి. ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులకు సెలవులు మంజూరు చేసినట్టు స్పీకర్ సభలో ప్రకటించడం గమనార్హం.
మరిన్ని
ఉత్సాహంగా.. ఉల్లాసంగా...: ప్రధాని
ఆరుగురు ఎస్పీ ఎంపీలు కిడ్నాప్: అమర్ సింగ్
ఓటు వేయనున్న భాజపా అనారోగ్య ఎంపీలు
యూపీఏకు ఆదికేశవులు సానుకూల ఓటు?
యూపీఏకే మా ఓటు: ఎన్‌సి
భాజపా ఆర్ధిక విధానాలు కొనసాగింపు : గురుదాస్