ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లోక్‌సభలో నోట్ల కట్టలు  Search similar articles
యూపీఏ ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చే ఓటింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అన్ని రాజకీయ పార్టీల నేతల్లో తీవ్ర ఉత్కంఠతలో ఉన్నారు. స్పీకర్‌ స్థానంలో సభాపతి సోమనాథ్ ఛటర్జీ లేరు. తాత్కాలిక స్పీకర్ సభా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు ఎంపీలు సభ పోడియం వద్దకు డబ్బు కట్టలతో కూడిన బ్యాగుతో వచ్చారు. బ్యాగులోని నోట్ల కట్టలను స్పీకర్‌కు చూపించారు.

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేతలు భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యులకు ఈ నోట్ల కట్టలను ఇవ్వజూపారని భాజపా సభ్యులు ఆరోపించారు. ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్‌ స్వయంగా ఈ కట్టలను ఇచ్చేందుకు పూనుకున్నారని వారు ఆరోపించారు. ఈ సంఘటన పార్లమెంట్‌ను ఒక్కసారి కుదిపేసింది. విశ్వాస పరీక్షపై చర్చ తాత్కాలికంగా వాయిదా పడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే పార్లమెంట్‌ ప్రాంగణంలోకి నోట్ల కట్టలు ఎలా వచ్చాయనే విషయం నిగ్గు తేలాల్సి వుంది.
మరిన్ని
లోక్‌సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
లోక్‌సభ సభాపతికి సీపీఎం మరో విజ్ఞప్తి
ఆరుగురు ఎంపీలకు ప్రత్యేక సెలవులు మంజూరు
ఉత్సాహంగా.. ఉల్లాసంగా...: ప్రధాని
ఆరుగురు ఎస్పీ ఎంపీలు కిడ్నాప్: అమర్ సింగ్
ఓటు వేయనున్న భాజపా అనారోగ్య ఎంపీలు