లోక్‌సభలో ఎంపీలకు లంచం ఇవ్వజూపిన విషయంపై సభాపతి సోమనాథ్ ఛటర్జీ అత్యవసరంగా అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో లంచం బ్యాగులపై చర్చ జరుపుతున్నారు. తాత్కాలిక స్పీకర్ విధులు నిర్వహిస్తుండగా, ముగ్గురు భాజపా ఎంపీలు నోట్ల బ్యాగులతో స్పీకర్ పోడియం వద్దకు ప్రవేశించి నోట్ల కట్లను చూపించారు. దీంతో సభలో ఒక్కసారి గందరగోళం నెలకొంది.
వెంటనే సభా కార్యక్రమాలను వాయిదా వేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే పార్లమెంట్‌లోకి ఇతరులు అంత సులభంగా ప్రవేశించే అవకాశం లేదు. అయితే.. కోటి రూపాయల విలువ చేసే నోట్ల కట్టలు ఎలా వచ్చాయనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
|