ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యధావిధిగా విశ్వాస పరీక్ష ఓటింగ్: సిబాల్  Search similar articles
యూపీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్ష ఓటింగ్ యధావిధిగా జరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. సభలోకి నోట్ల కట్టలు ఎలా వచ్చాయో తమకు తెలియవని ఆయన స్పష్టం చేశారు. ఈ సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచిన ముగ్గురు ఎంపీలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా యూపీఏ ప్రభుత్వంపై విశ్వాస పరీక్షా ఓటింగ్ సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. డబ్బుల కట్టలతో అధికార పక్షం తమను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని భాజపాకు చెందిన ముగ్గురు ఎంపీలు ఆరోపించిన విషయం తెల్సిందే.

భాజపాకు చెందిన ముగ్గురు ఎంపీలు నోట్ల కట్టలను స్పీకర్ ముందు ఉంచారు. అయితే.. భాజపా చేసిన ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. భాజపా పార్టీయే ముందుస్తు ప్రణాళికతో ఈ కుట్ర పన్నిందని కపిల్ సిబాల్ ఆరోపించారు.
మరిన్ని
అఖిల పక్ష నేతలతో స్పీకర్ భేటీ
ముగ్గురు ఎంపీలకు నగదు ఎర: అద్వానీ
లోక్‌సభలో నోట్ల కట్టలు
లోక్‌సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
లోక్‌సభ సభాపతికి సీపీఎం మరో విజ్ఞప్తి
ఆరుగురు ఎంపీలకు ప్రత్యేక సెలవులు మంజూరు