లోక్‌సభలో డబ్బు సంచులు వెలుగు చూడటం భారతీయ జనతా పార్టీ కుట్ర అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని కోరుతూ ఎస్పీ నేతలు భాజపా ఎంపీలకు లంచాన్ని ఇవ్వజూపారని చేసిన ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. ఈ సంచలన సంఘటన వెనుక భారతీయ జనతా పార్టీకి ప్రధాన పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.
లోక్‌సభలో మంగళవారం చేసుకున్న పరిణామాలపై ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భాజపా పన్నిన కుట్రను తీవ్ర ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, డబ్బు సంచులపై స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ విచరాణకు ఆదేశించనున్నారు.
|