ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విశ్వాస పరీక్షలో యూపీఏ ముందంజ  Search similar articles
నాటకీయ పరిణామాల మధ్య మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గట్టెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తుదికంటా ఉత్కంఠ భరితంగా సాగిన విశ్వాస పరీక్షలో యూపీఏ సంకీర్ణ పాలకులే విజయం సాధించే అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా యూపీఏ విజయాన్ని మాత్రం అడ్డుకోలేక పోయాయి. ఓటింగ్ అనంతరం లెక్కించిన తొలి దశ ఓట్ల ప్రకారం యూపీఏకు 253 ఓట్లు పోలు కాగా, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ఇద్దరు సభ్యులు గైర్హాజరు అయ్యారు.

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకున్న విషయం తెల్సిందే. దీంతో యూపీఏ ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. ఇందుకోసం రెండు రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరిచారు. తన ప్రభుత్వంపై ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ సాగింది. ఆ తర్వాత జరిగిన ఓటింగ్‌లో యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా 253 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. మ్యాన్యువల్ ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతోంది.
మరిన్ని
ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
ఇదంతా భాజపా కుట్ర: ములాయం సింగ్
మంత్రివర్యులతో ప్రధాని మంతనాలు
యధావిధిగా విశ్వాస పరీక్ష ఓటింగ్: సిబాల్
అఖిల పక్ష నేతలతో స్పీకర్ భేటీ
ముగ్గురు ఎంపీలకు నగదు ఎర: అద్వానీ