మన్మోహన్ చిరు నవ్వులు చిందించారు. యూపీఏ ప్రభుత్వం విజయం సాధించింది. యూపీఏ సంకీర్ణ పాలకులు ఆది నుంచి ప్రకటిస్తున్నట్టుగానే విజయాన్ని కైవసం చేసుకున్నారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రభుత్వానికి అనుకూలంగా 275 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 256 ఓట్లు వచ్చాయి. కాగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో మొత్తం 487 మంది సభ్యులు పాల్గొన్నారు.
వీరిలో ప్రభుత్వానికి మద్దతుగా 253 మంది సభ్యులు మద్దతు తెలుపగా, వ్యతిరేకంగా 252 మంది సభ్యులు ఓటు వేశారు. తొలి దశలో జరిగిన ఎలక్ట్రానిక్ ఓట్ల లెక్కింపులో ప్రభుత్వం 21 ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగిన యూపీఏ మొత్తం ఓట్లలో 19 ఓట్లతో విజయం సాధించింది. తొమ్మిది మంది సభ్యులు సభకు హాజరుకాలేదు.
గతంలో జరిగిన విశ్వాస పరీక్షల ఫలితాలను ఒకసారి అవలోకిస్తే...
1979... జనతా పార్టీ చీలిక వర్గంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరణ్ సింగ్ 1979లో విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో సభకు రాకుండానే తన పదవికి రాజీనామా చేశారు.
1989... ప్రధానిగా ఉన్న వి.పి.సింగ్ 1989 డిసెంబరులో బలపరీక్షను ఎదుర్కొన్నారు. ఈ పరీక్షలో విజయం సాధించినప్పటికీ.. ఒక ఏడాదిలో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.
1990... రాజీవ్ గాంధీ మద్దతుతో చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, 1990 నవంబరులో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. విశ్వాస పరీక్షలో విజయం సాధించినప్పటికీ ఐదు నెలల తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో పడిపోయింది.
1991... విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న ప్రధాని పి.వి.నరసింహారావు గెలుపొంది, ఐదేళ్లు అధికారంలో కొనసాగారు.
1997... హెచ్.డి.దేవెగౌడ ప్రభుత్వం 1997 ఏప్రిల్ నెలలో బలపరీక్షను ఎదుర్కోగా, కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించింది. ఇదే పార్టీ మద్దతుతో దేవెగౌడ ప్రభుత్వం కూలిపోయింది.
1997... ఐకే.గుజ్రాల్ నేతృత్వంలోని 1997 ఏప్రిల్‌లో ప్రభుత్వం ఏర్పాటు కాగా, సంపూర్ణ మెజారిటీ లేక పోవడంతో ఇదే ఏడాది నవంబరులో రాజీనామా చేశారు.
1998... విశ్వాస పరీక్షకు సిద్ధమైన వాజ్‌పేయి బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు.
1999... వాజ్‌పేయి ప్రభుత్వం విజయం సాధించింది.
2004... ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొని లెఫ్ట్ మద్దతుతో విజయం సాధించారు. మంగళవారం జరిగిన బలపరీక్షలో సమాజ్‌వాది పార్టీ మద్దతుతో గెలుపొందారు.
|