ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పీఎంగా అద్వానీని అంగీకరిస్తారా..? - ప్రధాని ప్రశ్న  Search similar articles
దేశ ప్రధానిగా ఎల్కే.అద్వానీ బాధ్యతలు చేపట్టడాన్ని వామపక్షాలు అంగీకరిస్తారా? అని ప్రధాని మన్మోహన్ సింగ్ సూటిగా ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ తనను చేతగానీ ప్రధానిగా వర్ణించడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తనపై చౌకబారు విమర్శలు చేయడాన్ని మానుకొని దేశహితం కోసం కాస్తైనా ఆలోచించాలని ఆయన హితవు పలికారు. ప్రతి విషయాన్ని పెద్దది చేయవద్దని, అలాగే, పార్లమెంట్‌ విలువైన సమయాన్ని వృధా చేయరాదని అద్వానీకి హితవు పలికారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఫలితాలు యూపీఏకు అనుకూలంగా వచ్చిన మరుక్షణమే అద్వానీ, వామపక్షాలపై అద్వానీ నిప్పులు చెరిగారు. జాతి ప్రయోజనాలను, హితాన్ని దృష్టిలో ఉంచుకొని, తప్పుడు సలహాలు ఇస్తున్న వ్యక్తిగత జ్యోతిష్కుడుని అద్వానీ మార్చుకోవాలని ఆయన సలహాఇచ్చారు.

ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లు తదితర సంఘటనల్లో అద్వానీ ప్రత్యక్ష పాత్ర ఉన్న విషయాన్ని ఎవరూ మరువలేరని, జాతి ప్రజలను ఆయన్ను ఎన్నటికీ క్షమించబోరని ప్రధాని మన్మోహన్ సింగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని
'విశ్వాసం'లో యూపీఏ ఘన విజయం
విశ్వాస పరీక్షలో యూపీఏ ముందంజ
ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
ఇదంతా భాజపా కుట్ర: ములాయం సింగ్
మంత్రివర్యులతో ప్రధాని మంతనాలు
యధావిధిగా విశ్వాస పరీక్ష ఓటింగ్: సిబాల్