జమ్మూ-కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోగా, మరో 29మంది తీవ్రగాయాలకు గురైయ్యారు. బుధవారం ఉదయం కొండ నుంచి అదుపుతప్పి లోతైన లోయలో పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.
శ్రీనగర్ నుంచి జమ్మూకు పయనించిన ఈ బస్సు, రాంబన్ జిల్లాలోని షెరిబి ప్రాంతంలో అదుపుతప్పి 400 అడుగుల లోతైన లోయలో పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సైనికులు రంగంలోకి దిగి, 13 మృతదేహాలను వెలికితీశారు.
తీవ్రగాయాలకు గురైన మరో 31మంది ప్రయాణీకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరో ఇద్దరు మరణించారు. జమ్మూ, ఉదంపూర్ ప్రాంతాల్లోని ఆస్పత్రులలో 25మంది గాయపడిన ప్రయాణీకులు చికిత్స పొందుతున్నారు.
|