ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భాజపా ఎంపీలకు షోకాజ్ నోటీసులు  Search similar articles
విశ్వాస పరీక్ష సమయంలో సభకు గైర్హాజరైన ఎంపీలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేయనుంది. అంతేకాకుండా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎంపీలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ప్రకటించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోగా, ఇందులో యూపీఏ ప్రభుత్వం 19 ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెల్సిందే.

ఈ పరీక్షలో యూపీఏ ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే గట్టి పోటీ ఇస్తారని భావించిన ప్రతిపక్ష పార్టీలు పెద్దగా పోటీని ఇవ్వలేక పోయాయి. అటు ఎన్డీయో, లెఫ్ట్, యూఎన్‌పీఏ కూటములకు చెందిన ఎంపీలు చేతులు కలిపినప్పటికీ 256 మందికిపైగా హాజరు కాలేక పోయారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి చెందిన ఎంపీలు పది మంది సభకు హాజరుకాలేదు.

ఇది యూపీఏకు ఎంతగానే మేలు చేకూర్చింది. ఇందులో భాజపాకు చెందిన సభ్యులే ఎక్కువగా ఉండగా, మరికొందరు ఎంపీలు విప్‌ను ధిక్కరించి, యూపీఏకు ఓటు వేశారు. దీంతో యూపీఏ సులభంగా విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కింది. భాజపా, శిరోమణి అకాలీదళ్, తెదేపా, జనతాదళ్ (యు), శివసేన, జనతాదళ్ (ఎస్) తదితర పార్టీలకు చెందిన ఎంపీలు యూపీఏకు పరోక్షంగా సహకరించారు.
మరిన్ని
యూపీఏకు వ్యతిరేకంగా 'మహా' ఆందోళన
పంజాబ్‌లో సిక్కుల నిరసన
జమ్మూ-కాశ్మీర్ రోడ్డు ప్రమాదం : 15మంది మృతి
"మాయ"తో తృతీయ కూటమి నేతల భేటీ
సీపీఎం నుంచి సోమనాథ్‌ బహిష్కరణ..?
పీఎంగా అద్వానీని అంగీకరిస్తారా..? - ప్రధాని ప్రశ్న