ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
క్యాబినెట్ బెర్తులకు కోరలేదు : అమర్ సింగ్  Search similar articles
కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేముందు తమకు క్యాబినెట్ బెర్తులు కావాలని డిమాండ్ చేయలేదని సమాజ్‌వాదీ పార్టీ జనరల్ సెక్రటరీ అమర్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పాలుపంచుకుంటామా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది తాను కాదని తెలిపారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో పాలుపంచుకోకూడదని తాము గతంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో బుధవారం సమావేశమైనప్పడు దీనిపై చర్చించలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌కు తాము శుభాకాంక్షలు మాత్రమే తెలియజేశామన్నారు.

అలహాబాద్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత రేవతీ రమణ్ సింగ్ భాజపా లోక్‌సభ సభ్యులను కలిశారన్న దానిపై మాట్లాడుతూ, ఏ సభ్యుడు ఎవరితోనైనా మాట్లాడే స్వేచ్ఛను ఎస్పీ ఇచ్చిందని వివరించారు. అయితే వారు ఎందుకోసం కలిశారన్నది అసందర్భం అన్నారు. తమ ఇంటికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చునని తెలిపారు. గత నెల రోజులుగా తమ ఇంటిపై మీడియా పూర్తిస్థాయిలో కన్నేసిందని అమర్ సింగ్ వెల్లడించారు.
మరిన్ని
ఆరోపణలపై ఫిర్యాదు చేయండి : లోక్‌సభ
మారిషస్ విమానంలో మంటలు : ప్రయాణికులు క్షేమం
సోమనాథ్ అప్పీలు చేసుకోవచ్చు : కారత్
శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి : ఐదుగురి మృత్యువాత
సోమనాథ్ నివాసంలో ప్రధాని భేటీ
మాయావతి ప్రమాదకారి : థాకరే విమర్శ