తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో దేశ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పదంగా తిరిగే స్వదేశీ, విదేశీ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల బెంగుళూరు, అహ్మదాబాద్‌లలో జరిగిన వరుస పేలుళ్ల నేపథ్యంలో మహారాష్ట్రలో 48 మంది బంగ్లాదేశీయులను పోలీసుల అరెస్టు చేశారు. వీరివద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.
మరోపక్క అఖిల భారత వ్యతిరేక కూటమి అహ్మదాబాద్ పేలుళ్ల సూత్రదారుల గురించి సమాచారం అందిస్తే రూ.10 లక్షల నజరానా అందజేస్తామని ప్రకటించింది. ఇక సిమి కార్యకర్త, తన్వీర్ ముల్లా అనుచరుడిగా భావిస్తున్న ఇక్బాల్‌కు ఈ నెల ఎనిమిదో తేదీ వరకు కోర్టు రిమాండు పొడగించింది. అయితే విచారణలోని వివరాలను మాత్రం వెల్లడించారు.
|