బీహార్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. మరో 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేలో వెళుతున్న బస్సును ట్రక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కపసారి అనే ప్రాంతంలోని చండితాలా పోలీస్ స్టేషన్ పరధిలో చోటు చేసుకోకా, బాధితులంతా జార్ఖండా రాష్ట్రానికి చెందిన వారు.
దీనిపై స్థానిక పోలీసులు స్పందిస్తూ.. 42 మంది భక్తులు కైమూర్ నుంచి రోహ్‌టాస్‌కు వెళుతున్నారని చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ జిల్లాలోని బాబాధమ్‌లో పూజలు అనంతరం హుగ్లీలోని తారకేశ్వర్ ఆలయం, ఆ తర్వాత కోల్‌కతాలోని కాలిఘాట్ టెంపుల్ దర్శనానికి వెళుతున్నట్టు చెప్పారు. రిపేరుకు గురైన బస్సు రోడ్డు పక్కన నిలిపి వుంచగా, ఎదురుగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే 13 మంది అక్కడికక్కడే మృతి చెందారని మరో 25 మంది గాయపడినట్టు చెప్పారు. క్షతగాత్రులను చండితాలా రూరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో కొందరిని ఉత్తరపారా రాష్ట్ర జనరల్ ఆస్పత్రికి, మరికొందరిని కోల్‌కతా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.
|