రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై నిషేధం విధించాలని పట్టుబడుతున్న స్వపక్షాలైన సమాజ్‌వాదీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్జేడీ) లకు కాంగ్రెస్ మద్దతు పలికింది. ఆర్ఎస్ఎస్‌పై గతంలో మూడుసార్లు నిషేధాన్ని ప్రభుత్వాలు విధించాయని కాంగ్రెస్ ప్రతినిధి షకీల్ అహ్మద్ చెప్పారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), శివసేనలపై నిషేధం విధించాలని ఎస్పీ, ఆర్జేడీల చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యకు ప్రాథాన్యత చేకూరింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా షకీల్ అహ్మద్ వ్యవహరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విషయంలో కేంద్రం ప్రభుత్వం తరుపున కాకుండా కాంగ్రెస్ పార్టీ వైపు వ్యాఖ్య చేస్తున్నానని అహ్మద్ స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్‌తో పాటుగా భజరంగ్‌దళ్, వీహెచ్‌పీలపై కూడా నిషేధం విధించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంత రాష్ట్రాల్లో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్‌లకు గట్టి పట్టు ఉంది.
|