ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > సిమిపై నిషేధం కొనసాగింపు : సుప్రీం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సిమిపై నిషేధం కొనసాగింపు : సుప్రీం
స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని ఎత్తివేస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సర్వోన్నత ధర్మాసనం స్టే విధించింది. ఢిల్లీ హైకోర్టు ప్రత్యేక ట్రైబ్యునల్ ఆదేశాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు పరిశీలించింది.

సిమి కార్యకలాపాలను కొనసాగనిస్తే ప్రమాదకర పరిణామాలు తలెత్తుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ, సుప్రీంను ఆశ్రయించింది. అయితే ట్రైబ్యునల్ ఆదేశంపై ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఉత్తర్వులను జారీ చేసింది. సిమికి నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

ముందుగా యథాతథ స్థితి ఉత్తర్వులివ్వాలని ధర్మాసం భావించినప్పటికీ మధ్యంతర నిలిపివేత ఉత్తర్వుల కోసం అదనపు సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణ్యం పట్టుబట్టారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో సిమి పాత్రపై నిఘా నివేదికలను సమర్పించినా ట్రైబ్యునల్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా యధాతథ స్థితి వల్ల ట్రైబ్యునల్ ఆదేశాలే అమలవుతాయని, అప్పుడు తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని వెల్లడించారు. దీంతో సుప్రీం కోర్టు స్టే మంజూరు చేసింది.

ఇదిలా ఉండగా, సిమిపై నిషేధానికి మద్దతుగా ట్రైబ్యునల్‌కు ఆధారాలను సమర్పించడంలో కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిలస్ విఫలమయ్యారని భాజపా ధ్వజమెత్తింది. అసమర్థంగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం మంత్రిని పదవి నుంచి తొలగించాలని భాజపా డిమాండ్ చేసింది.
మరిన్ని
ఆర్ఎస్ఎస్‌పై నిషేధానికి కాంగ్రెస్ మద్దతు
హుగ్లీ‌లో రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి
48 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
'సిమి'పై నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు
అమర్‌నాథ్ వ్యవహారం: నేడు అఖిలపక్ష భేటీ
సెప్టెంబరుకు పార్లమెంట్ సమావేశాలు వాయిదా