ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > దేశ రాజధానిలో భారీ వర్షం: ట్రాఫిక్ జామ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశ రాజధానిలో భారీ వర్షం: ట్రాఫిక్ జామ్
దేశ రాజధాని న్యూఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు చలి ఎక్కువైంది. ఐటీవో క్రాసింగ్స్, నిజాముద్దీన్ క్రాసింగ్స్, గాజీపూర్, అజాద్‌పూర్, లాజ్‌పేట్ నాగర్ తదితర ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

శుక్రవారం ఉదయం ఢిల్లీలో 15.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే 24 గంటల పాటు ఆకాశం మేఘామృతమై వుంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆకాశం దట్టమైన మబ్బులతో కూడుకొని ఉండటమే కాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణా రాష్ట్ర ప్రాంత ప్రజలను వరదలు ముంచెత్తున్న విషయం తెల్సిందే. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెల్సిందే.
మరిన్ని
ప్రధాని ఆర్థిక మండలికి రంగరాజన్ గుడ్‌బై!
1942 ఆగస్టు 8... క్విట్ ఇండియా తీర్మానం
మహిళా బిల్లు ఇక లేనట్టే: సుష్మా స్వరాజ్
అమర్‌నాథ్ వ్యవహారం : భాజపా ఆందోళనలు
అమర్‌నాథ్ వ్యవహారం: కమిటీ ఏర్పాటు
"అణువు"పై విస్తృత ప్రచారం : రాహుల్