ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > అస్సాంలో వరుస బాంబు పేలుళ్లు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అస్సాంలో వరుస బాంబు పేలుళ్లు!
అస్సాంలోని బొంగైగాన్ జిల్లాల్లో శనివారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉగ్రవాదులు దేశంలోని అనేక ప్రాంతాల్లో పంజా విసురుతున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అస్సాంలోని బొంగైగాన్ జిల్లాలో స్వహిద్ బేడి పోలీస్ చెక్ పోస్ట్, పగ్లథాన్‌లలో బాంబు పేలుడు సంభవించింది.

స్వహిద్ బేడి ప్రాంతంలో శనివారం ఉదయం ఈ బాంబు పేలుడు సంభవించిందని, మరో ఐదు నిమిషాల వ్యవధిలోనే పగ్లథాన్ ప్రాంతంలో రెండో బాంబు పేలిందని పోలీసులు వివరించారు. ఈ బాంబు పేలుడు ఘటనలో వాటిల్లిన నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఇదిలా ఉండగా, శుక్రవారం (ఆగస్టు 15)న అస్సాంలోని చిరంగ్ పరేడ్ గ్రౌండ్స్‌, దుబ్రీ జిల్లాల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇద్దరు తీవ్రగాయాలకు గురైయ్యారు.
మరిన్ని
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు : 8మంది అరెస్టు
మన్మోహనుడే యూపీఏ ప్రధాని అభ్యర్థి: సోనియా
కాశ్మీర్ లోయల్లో కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేత
బీహార్‌లో రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి
మత రాజకీయాలు సమగ్రతకు హానికరం: పీఎం
ఘనంగా 62వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు