ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కాశ్మీర్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాశ్మీర్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
FileFILE
జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితులపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోని, హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అల్లకల్లోలంగా మారిన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకు రావాలనే అంశంతో సహా, సమస్యకు పరిష్కార మార్గంపై వీరు చర్చలు జరిపారు.

ఈ చర్చల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ కూడా హాజరయ్యారు. శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు భూములను కేటాయింపు వివాదంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపేందుకు కొత్తగా మరో కమిటీని ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇందులో చర్చించినట్టు సమాచారం. ఆలయ బోర్డుకు భూములు కేటాయింపు, తిరిగి రద్దు వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది.

ఇది రాష్ట్రంలో అల్లర్లకు సైతం దారితీసింది. అల్లర్లలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశాన్ని ప్రధాని తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ప్రస్ఫుటంగా ప్రస్తావించారు. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అమర్‌నాథ్ వ్యవహారంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిని సైతం ఆయన తప్పుపట్టారు. మత రాజకీయాలు నిర్వహిస్తూ.. ప్రజలను విభజించరాదంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఘూటుగానే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై సీనియర్ మంత్రులతో ప్రధాని చర్చలు జరిపారు.
మరిన్ని
ఎట్టకేలకు ముగిసిన అమర్‌నాథ్ యాత్ర!
అస్సాంలో వరుస బాంబు పేలుళ్లు!
అహ్మదాబాద్ పేలుళ్లు: కీలక నిందితుడు అరెస్టు
మన్మోహనుడే యూపీఏ ప్రధాని అభ్యర్థి: సోనియా
కాశ్మీర్ లోయల్లో కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేత
బీహార్‌లో రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి