జైపూర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సంఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు తెలియవచ్చింది. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులైన 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు విద్యార్థులున్నారని, వీరిరువురి వద్ద పోలీసులు జరిపిన దర్యాప్తులో జైపూర్ బాంబు పేలుళ్లలో వీరి హస్తమున్నట్టు తెలిసింది.
అహ్మాదాబాద్ పేలుళ్ల కేసుకు సంబంధించి అరెస్టయిన వీరి వద్ద గుజరాత్ పోలీసులు మరిన్ని వివరాలు వెలికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గుజరాత్‌లో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న ముఫ్తి అబు బషీర్‌తో సహా సిమికి చెందిన మరో తొమ్మిది మంది కార్యకర్తలను పోలీసులు ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. దీనితో తొమ్మిది మంది సిమి కార్యకర్తలను కోర్టు 14 రోజుల పోలీసు కస్టడీకి తరలిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
|