ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > శ్రీనగర్‌లో వేలాది మంది స్వచ్ఛంధ అరెస్ట్!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీనగర్‌లో వేలాది మంది స్వచ్ఛంధ అరెస్ట్!
అమర్‌నాథ్ భూ కేటాయింపు వ్యవహారం రోజు రోజుకు పెచ్చరిల్లుతోంది. ఇందులో భాగంగా సోమవారం వేలకొలది మంది స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. అమర్‌నాథ్ భూకేటాయింపును రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాశ్మీర్ ప్రాంతంలో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఎఎస్ఎస్)కు చెందిన వేలకొలది మంది కార్యకర్తలు జమ్మూలోని పోలీస్ స్టేషన్ల ముందు స్వచ్ఛంధంగా అరెస్టయ్యారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, జైల్‌భరో కార్యక్రమం నిర్వహించడంతో నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇకపోతే కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన యదేచ్ఛగా సాగుతందని, దీన్నిఅడ్డుకునేందుకు గానూ హురియత్ నేతలు శ్రీనగర్లోని ఐరాస సైనిక పరిశీలన కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు వినతి పత్రం సమర్పించారు. శ్రీనగర్లో అమల్లో ఉన్న కర్ఫ్యూను, ర్యాలీపై నిషేధాన్ని వారు ఏమాత్రం లెక్కచేయలేదు.
మరిన్ని
జైపూర్ పేలుళ్లలో విద్యార్థుల ప్రమేయం!
మధుకోడా ప్రభుత్వానికి జేఎంఎం గుడ్‌బై..!
కాశ్మీర్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
ఎట్టకేలకు ముగిసిన అమర్‌నాథ్ యాత్ర!
అస్సాంలో వరుస బాంబు పేలుళ్లు!
అహ్మదాబాద్ పేలుళ్లు: కీలక నిందితుడు అరెస్టు