ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ముఖ్యమంత్రి మధుకోడాకు 25న బలపరీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముఖ్యమంత్రి మధుకోడాకు 25న బలపరీక్ష
జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసదాయకంలో పడ్డాయి. ముఖ్యమంత్రి మధుకోడా ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును జేఎంఎం చీఫ్ శిబు సొరేన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మధుకోడా ప్రభుత్వం మైనారిటీలో పడి పోయింది. దీంతో ఈనెల 25వ తేదీన బలపరీక్షను ఎదుర్కోవాలని జార్ఖండ్ గవర్నర్ సిబ్తీరజీ కోరారు.

మొత్తం 81 మంది సభ్యులు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 36 సీట్లు ఉన్నాయి. వీటిలో భాజపాకు 30, జేడీయూకు ఆరు సీట్లు ఉన్నాయి. ఇక పోతే.. కాంగ్రెస్‌కు తొమ్మిది, జార్ఖండ్ ముక్తి మోర్ఛాకు 17 సీట్లు ఉండగా, రాష్ట్రీయ జనతాదళ్‌కు ఏడు, ఇతరులకు 12 సీట్లు ఉన్నాయి.

ప్రస్తుతం మధుకోడా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం వుంది. ఈ ప్రభుత్వానికి కొందరు స్వతంత్ర అభ్యర్థులు మద్దుతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఎంఎం చీఫ్ సొరేన్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి, ముధుకోడా ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకున్నారు. మధుకోడా బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
మరిన్ని
అమర్‌నాథ్ రథయాత్రకు భాజపా శ్రీకారం
బలనిరూపణకు సిద్ధం: మధు కోడా
ముష్ రాజీనామా పాక్ అంతర్గత వ్యవహారం : ప్రణబ్
శాంతిభద్రతలను కాపాడకపోతే పదవికి రాజీనామా: ఓమర్
జమ్మూలో శాంతికి సహకరించండి! : ప్రధాని
శ్రీనగర్‌లో వేలాది మంది స్వచ్ఛంధ అరెస్ట్!