ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > జమ్ము-సాంబా జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జమ్ము-సాంబా జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత
జమ్ము, సాంబా జిల్లాల్లో అమలులో ఉన్న కర్ఫ్యూను శనివారం ఎత్తివేశారు. అలాగే.. ఉధమ్‌పూర్ జిల్లాలో కూడా శనివారం ఉదయం ఐదు నుంచి పది గంటల వరకు ఎత్తివేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉధమ్‌పూర్‌లో కర్ఫ్యూను ఎత్తివేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే సరిహద్దు పట్టణ ప్రాంతమైన హిరానగర్‌లో మాత్రం కొనసాగుతోంది. కిష్‌త్వర్‌లో మాత్రం ఆరు గంటల పాటు కర్ఫ్యూను తొలగించారు.

అమర్‌నాథ్ ఆలయ భూముల వ్యవహారానికి సంబంధించి వేర్పాటువాదులు ఒకవైపు, హిందూ సంఘాలు, సంఘ్ పరివార్‌శక్తులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని అణచి వేసేందుకు కేంద్రం సైనిక బలగాలను ప్రయోగించినప్పటికీ.. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
మరిన్ని
త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తా..!: మధుకోడా
'శాంతినికేతన్‌'లో శేషజీవితం: సోమనాథ్
మూడో ఫ్రంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం : ఏచూరీ
ఢిల్లీ చేరిన బాబు : కారత్‌తో భేటీ!
రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం హెచ్చరిక
సోనియా ఆదేశిస్తే రాజీనామా చేస్తా : కోడా