ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > శిబుసోరేన్‌కు మధుకోడా, మరాండీ మద్దతు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శిబుసోరేన్‌కు మధుకోడా, మరాండీ మద్దతు!
ఎట్టకేలకు జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. యూపీఏ ప్రభుత్వ ఆదేశానుసారం రాజీనామా చేసిన మాజీ జార్ఖండ్ సీఎం మధుకోడా సోమవారం జెఎంఎం అధినేత శిబుసోరెన్‌కు మద్దతిచ్చేందుకు అంగీకరించారు. ఆదివారం వరకు శిబుసోరేన్‌కు పచ్చజెండా ఊపని మధుకోడా... తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో జార్ఖండ్‌లో తలెత్తిన రాజకీయ అనిశ్చితి అంతమైంది.

ఇకపోతే మధుకోడాతో పాటు మరో నాయకుడు సీఫెన్ మరాండీ కూడా సోరెన్ సారథ్యంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మరాండీ విలేకరులతో మాట్లాడుతూ... గురూజీ (సోరెన్) తన నివాసమును విచ్చేసి మద్దతివ్వాలని కోరారని, దీనితో తన నిర్ణయాన్ని మార్చుకుని సోరెన్‌కు మద్దతు పలికానని అన్నారు.

ఇదిలా ఉండగా, మధుకోడా, మారండీలతో పాటు మరో ముగ్గురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు సోరెన్‌కు సోమవారం మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో భాను ప్రతాప్ సాహి, ఎనోస్ ఎకా, హరినరీన్ రాయ్‌లు ఉండగా, జోబా మన్జిని, బంధు తిర్కే అనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా శిబుసోరెన్‌కు మద్దతిచ్చారు. దీంతో మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి పగ్గాలను సోరేన్ చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
మరిన్ని
జమ్మూలో మళ్ళీ ఘర్షణలు : ఒకరి మృతి
అణు ఒప్పందంపై ప్రణబ్ చర్చలు
'టాటా' తరలింపు వార్తలు కొట్టేసిన బుద్ధదేవ్
ఎన్‌ఎస్‌జి షరతులకు తలొగ్గం: ప్రణబ్
మధుకోడా రాజీనామా: సోరేన్‌కు మార్గం
తమిళనాడు రాజధాని 'చెన్నై' 369 ఏళ్ల వైభవం