ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > లక్ష్మణానంద హత్యపై దద్దరిల్లిన ఒరిస్సా అసెంబ్లీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లక్ష్మణానంద హత్యపై దద్దరిల్లిన ఒరిస్సా అసెంబ్లీ
విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నేత లక్ష్మణానంద సరస్వతి హత్యోదంతానికి కారణమైన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఒరిస్సా అసెంబ్లీలో బీజేపీ డిమాండ్ చేసింది. దీనితో సోమవారం ఒరిస్సా అసెంబ్లీ దద్దరిల్లింది.

లక్ష్మాణనందను హతమార్చిన వారిని అరెస్టు చేయాలంటూ భాజపా ఎమ్మెల్యేల నినాదాలతో సభా కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. దీనితో స్పీకర్ సభను తొలుత గంటసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా బీజేపీ నేతల నినాదాలు కొనసాగుతుండటంతో సభ మరోసారి వాయిదా పడింది.

ఇదిలా ఉండగా, విహెచ్‌పిలో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మణానంద స్వామిని నలుగురు సైనికులు కాల్చి చంపడం సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. దీన్ని ఖండిస్తూ... వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది.

స్వామి హత్యకు గురైన కంథమాల్ ప్రాంతంలో బంద్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. భువనేశ్వర్, కటక్ వంటి తదితర ప్రాంతాల్లోవీహెచ్‌పీ బంద్‌తో రాకపోకలు స్థంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
మరిన్ని
శిబుసోరేన్‌కు మధుకోడా, మరాండీ మద్దతు!
జమ్మూలో మళ్ళీ ఘర్షణలు : ఒకరి మృతి
అణు ఒప్పందంపై ప్రణబ్ చర్చలు
'టాటా' తరలింపు వార్తలు కొట్టేసిన బుద్ధదేవ్
ఎన్‌ఎస్‌జి షరతులకు తలొగ్గం: ప్రణబ్
మధుకోడా రాజీనామా: సోరేన్‌కు మార్గం