ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కాశ్మీర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాశ్మీర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విధించిన నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ.. పరిస్థితిని సడలించే ప్రసక్తే లేదని భద్రతా అధికారులు స్పష్టం చేశారు. అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూముల కేటాయింపు వ్యవహారం జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన విషయం తెల్సిందే. ఒకవైపు వేర్పాటు వాదులు, మరో వైపు సంఘ్ పరివార్ శక్తులు‌ పోటాపోటీగా ఆందోళనలు నిర్వహిస్తూ.. శాంతియుతంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు నెలకొనేలా వాతావరణం సృష్టించారు.

ఆందోళనకారులు రెచ్చిపోవడంతో, వారిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. పరిస్థితి చేయిదాటిన చోట నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూ 24వ తేదీ నుంచి ఇది కొనసాగుతోంది. దీనిపై భద్రతా అధికారులు స్పందిస్తూ.. కాశ్మీర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని, అయినప్పటికీ కర్ఫ్యూను సడలించే ప్రసక్తే లేదన్నారు. ప్రజలు తమ ఇళ్ళలోనే ఉండాలని, వీధుల్లోకి రావద్దని ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
మరిన్ని
ప్రభుత్వ ఏర్పాటుకు సోరేన్‌కు ఆహ్వానం
తమిళనాడుకు రానున్న ప్రధాని, సోనియా
సిమిపై నిషేధం పొడిగింపు : సుప్రీం
లక్ష్మణానంద హత్యపై దద్దరిల్లిన ఒరిస్సా అసెంబ్లీ
శిబుసోరేన్‌కు మధుకోడా, మరాండీ మద్దతు!
జమ్మూలో మళ్ళీ ఘర్షణలు : ఒకరి మృతి