ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > జైపూర్ పేలుళ్లు: మరో ఏడుగురు అరెస్టు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జైపూర్ పేలుళ్లు: మరో ఏడుగురు అరెస్టు
జైపూర్ వరుస పేలుళ్ళకు సంబంధించిన మరో ఏడుగురు సిమి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద విచారణ జరిపేందుకు వచ్చే నెల ఏడో తేదీ వరకు పోలీసు కష్టడీకి తరలించారు. గత మే నెల 13వ తేదీన జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లు జరుగగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేయాగా, తాజాగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇమ్రాన్ అలియాస్ రాజా, నజకత్, మెహందీ హాసన్, అమానుల్లా అలియాస్ అమన్, డాక్టర్ యూనస్, తౌఫిక్ డాక్టర్ ఇషాక్‌లను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. షాహంజ్ హుస్సేన్ కీలక నిందితుడిగా భావిస్తున్నారు. ఆయన జైపూర్‌లో బాంబులు పాతిపెట్టేందుకు స్థలాల ఎంపిక, అనుచరులకు సూచనలు, సలహాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినట్టు రాజస్థాన్ పోలీసు ప్రతినిధి వెల్లడించారు.
మరిన్ని
కాశ్మీర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ
ప్రభుత్వ ఏర్పాటుకు సోరేన్‌కు ఆహ్వానం
తమిళనాడుకు రానున్న ప్రధాని, సోనియా
సిమిపై నిషేధం పొడిగింపు : సుప్రీం
లక్ష్మణానంద హత్యపై దద్దరిల్లిన ఒరిస్సా అసెంబ్లీ
శిబుసోరేన్‌కు మధుకోడా, మరాండీ మద్దతు!