పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పూంఛ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ఆ దేశ సైనికులు కాల్పులకు పాల్పడ్డారు. పాక్ సైనికులు కావాలనే కాల్పులకు పాల్పడినట్టు బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు భారత సరిహద్దు దళం సిబ్బంది గాయపడ్డారు. పూంఛ్ జిల్లాలోని సబ్జీయానా అనే ప్రాంతంలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు కాల్పులకు పాల్పడ్డారని బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు.
కాల్పుల్లో గాయపడిన సిబ్బందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వీరి పరిస్థితి బాగానే ఉందని అధికారులు చెప్పారు. బీఎస్‌ఎఫ్ బలగాలు నియంత్రణ రేఖ వద్ద గస్తీలో ఉండగా పాక్ సైనికులు కాల్పులకు పాల్పడినట్టు వారు ఆరోపించారు. ఐదేళ్ళ క్రితం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోగా, గత జనవరి నుంచి ఇప్పటి వరకు 31 సార్లు పాకిస్థాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
ఈనెలలోనే మూడు సార్లు ఉల్లంఘించింది. ఆగస్టు 11వ తేదీన పూంఛ్ జిల్లాలోని షాబ్జీయానా ప్రాంతంలోను, ఆగస్టు 21వ తేదీన రాజౌరి జిల్లాలోని జంగర్ ప్రాంతంలో పాక్ రేంజర్లు కాల్పులకు జరిపారు. రాజౌరి, సాంబా, ఉరి, తంగ్దర్, పూంఛ్ జిల్లాల్లో సరిహద్దుల నుంచి మిలిటెంట్లు భారత్‌లోకి చొరబడేందుకు మిలిటెంట్లు ప్రయత్నించారు. ఇదే అదునుగా చేసుకుని పాక్ సైనికులు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించారు.
|