జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్ఛా అధినేత శిబుసోరెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో జరుగనున్న ఓ కార్యక్రమంలో సోరెన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు.
మొత్తం 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో సోరెన్‌కు 43 మంది సభ్యుల మద్దతు తెలిపిన విషయం తెల్సిందే. దీంతో సోరెన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ సిబ్తే రజీ ఆహ్వానించారు. కేంద్రంలో విశ్వాస పరీక్ష అనంతరం నెలకొన్న విభిన్న పరిణామాల నేపథ్యంలో చాకచక్యంగా పాలువులు కదిపిన సోరెన్ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
అనంతరం మధుకోడా మద్దతు, లాలూ బుజ్జగింపులతో రాజకీయ ఉత్కంఠత తెరపడింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి అవసరమైన బలసమీకరణ జరుపుకొని సోరెన్ ఈ రోజు (బుధవారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోరెన్‌తో పాటు మరో 12 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
|