ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ఒరిస్సా సంకీర్ణ ప్రభుత్వానికి గండం..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒరిస్సా సంకీర్ణ ప్రభుత్వానికి గండం..!
ఒరిస్సాలోని బిజూ జనతాదళ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. విశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మణానంద స్వామి హత్యానంతరం నెలకొన్న పరిస్థితులు ఆ ప్రభుత్వానికి విపత్కర పరిస్థితుల్లోకి నెట్టింది. ఒరిస్సా రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో మద్దతు ఉపసంహరించే దిశగా కమలనాథులు యోచిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం.

ముఖ్యమంత్రి పట్నాయక్‌పై ఆగ్రహంగా ఉన్న బిజెపి ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లకెర నియోజకవర్గానికి చెందిన భాజపా ఎమ్మెల్యే బృందావన్‌ మహి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధికార పార్టీ బీజేడి వ్యవహారశైలికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

మరికొంత మంది భాజపా ఎమ్మెల్యేలు కూడా బిజెడి ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మరికొందరు పార్టీ అధ్యక్షుడు రాజ్‌‌నాథ్ సింగ్‌తో సహా మరికొందరు అగ్రనేతలను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధిష్టానంపై పెరుగుతోంది. ఈ కారణంగా మద్దతు భాజపా ఉపసంహరించుకునే దిశగా యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మరిన్ని
జార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం
కందమాల్ హింస.. 13కు పెరిగిన మృతులు
అక్టోబరు 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు
నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు
జైపూర్ పేలుళ్లు: మరో ఏడుగురు అరెస్టు
కాశ్మీర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ