ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > సోనియా గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సోనియా గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం!
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సోనియా గాంధీ ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిలిపి వేశారు. విమానంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ఉన్నారు.

సోనియా గాంధీ కోయంబత్తూరు పర్యటనకు బయలుదేరిన సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఈ సంఘటన పట్ల జాతీయ భద్రతా మండలి విచారణకు ఆదేశించింది. అనంతరం సోనియా గాంధీ ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయలుదేరి వెళ్ళారు.

ఇదిలా ఉండగా, మద్రాసు యానివర్శిటీని ప్రారంభించి 150 వసంతాలు పూర్తిచేసుకున్న నేపధ్యంలో... దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీలకు గౌరవ డాక్టరేట్‌లను అందించనున్నారు. ఈ కార్యక్రమం చెన్నైలోని మద్రాసు వర్శిటీలో శుక్రవారం జరుగనుంది.
మరిన్ని
జైపూర్ పేలుడు : సూత్రధారి నిర్ధారణ
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వైద్యలింగం!
అణు వివాదం : ప్రధాని రాజీనామాకు బీజేపీ డిమాండ్
బీహార్ వరద బాధితులను ఆదుకోండి : ప్రధాని
అణు పరీక్షపై భారత్‌కు హక్కు: ప్రధాని
తీవ్రవాదంపై యూపీఏ మెతక వైఖరి : అద్వానీ