ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > దేశాన్ని తప్పుదోవ పట్టించిన ప్రధాని: ఏచూరీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశాన్ని తప్పుదోవ పట్టించిన ప్రధాని: ఏచూరీ
FileFILE
భారత్-అమెరికా అణు ఒప్పందం వ్యవహారంలో అటు పార్లమెంట్‌తో పాటు.. ఇటు దేశ ప్రజలను ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పుదోవ పట్టించారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ అరోపించారు. జార్జి‌బుష్ యంత్రాంగం అమెరికా కాంగ్రెస్‌కు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు వెల్లడి కావడం, వాటిపై భారత్‌‌లో పెద్ద దుమారం చెలరేగిన విషయం తెల్సిందే.

వీటిపై ఏచూరీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో యూపీఏ అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. అందువల్ల అణు ఒప్పందం అమలుకు చేపట్టిన చర్యలను తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుష్ పాలనా యంత్రాంగానికి, యూఎస్ కాంగ్రెస్‌కు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ ప్రధానికి ఇచ్చిన హామీలకు భిన్నంగా ఉన్నాయన్నారు.

అందువల్ల యూపీఏ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందన్నారు. ఈ తాజా పరిణామాలు లెఫ్ట్ పార్టీలు చేస్తున్న వాదనకు మద్దతుగా నిలిచాయని, అందువల్ల అణు ఒప్పందం అమలుకు చేపట్టిన చర్యలను తక్షణం నిలిపి వేయాలని ఏచూరీ డిమాండ్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబరు 17వ తేదీ వరకు ఆగి వుండలేమని, అందువల్ల పార్లమెంట్‌ను అత్యవసరంగా సమావేశపరచాలని కోరారు. దేశ ప్రజలను, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించినందుకు గాను ప్రధాని మన్మోహన్ సమాధానం ఇవ్వాలని కోరారు. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడానికి గల కారణాలు ఏమిటని ఏచూరీ ప్రశ్నించారు.
మరిన్ని
సోనియా గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం!
జైపూర్ పేలుడు : సూత్రధారి నిర్ధారణ
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వైద్యలింగం!
అణు వివాదం : ప్రధాని రాజీనామాకు బీజేపీ డిమాండ్
బీహార్ వరద బాధితులను ఆదుకోండి : ప్రధాని
అణు పరీక్షపై భారత్‌కు హక్కు: ప్రధాని