ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > మమతతో బెంగాల్ గవర్నర్ కీలక భేటీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మమతతో బెంగాల్ గవర్నర్ కీలక భేటీ
సింగూర్ సమస్య పరిష్కారం కోసం శాంతి మార్గాలను అన్వేషించడానికి బెంగాల్ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందుకోసం ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం కోసం రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని రంగంలోకి దింపింది. ఆయన ఇప్పటికే ఇరు వర్గాల నేతలతో ప్రాథమిక చర్చలు జరిపారు. రెండో రోజు చర్చల్లో భాగంగా శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రభుత్వ ప్రతినిధులతో గవర్నర్ చర్చలు జరుపనున్నారు.

దీనిపై రాజ్‌భవన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. సింగూర్ సమస్య పరిష్కారానికి ఇరు వర్గాల ప్రతినిధులను ఆహ్వానించి చర్చలు జరిపేందుకు గవర్నర్ చర్యలు చేపట్టారని అందులో పేర్కొంది. ఇందులోభాగంగా తలెత్తే సమస్యలకు న్యాయపరమైన సలహాలను ముంబై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చిత్తోష్ ముఖర్జీ‌ ఇస్తారని పేర్కొంది.
మరిన్ని
సింగూర్‌పై ఫలించిన గాంధీ మధ్యవర్తిత్వం
దేశాన్ని తప్పుదోవ పట్టించిన ప్రధాని: ఏచూరీ
సోనియా గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం!
జైపూర్ పేలుడు : సూత్రధారి నిర్ధారణ
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వైద్యలింగం!
అణు వివాదం : ప్రధాని రాజీనామాకు బీజేపీ డిమాండ్