ఒక రోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకు చేరుకున్నారు. ఆయన వెంట కేంద్ర ఉక్కుగనుల శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఉన్నారు. వీరందరూ ఐఎఎఫ్‌కు చెందిన ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో రాజధాని న్యూఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చారు.
చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని మన్మోహన్‌కు రాష్ట్ర గవర్నర్ ఎస్ఎస్.బర్నాలా, ముఖ్యమంత్రి కరుణానిధి, కేంద్ర మంత్రి పి.చిదంబరం, రాష్ట్ర మంత్రులు దురై మురుగన్, ఆర్కాట్ వీరాస్వామి, కె.పొన్ముడి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీపతి, మేయర్ ఎం.సుబ్రమణ్యం, ఇతర ప్రభుత్వ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ప్రధాని నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి మద్రాసు విశ్వవిద్యాలయం 150 వార్షికోవత్సవాల్లో పాల్గొని, గౌరవ డాక్టరేట్‌ను అందుకుంటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియ గాంధీ కూడా పాల్గొంటారు. అనంతరం సేలం స్టీల్ ప్లాంట్ ఆధునకీకరణ పనులకు వారు శంకుస్థాపన చేస్తారు.
|