ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > సంజీవ్‌ నందాకు ఐదేళ్లు జైలుశిక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సంజీవ్‌ నందాకు ఐదేళ్లు జైలుశిక్ష
బీఎం‌డబ్ల్యూ కారు కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ నందాకు ఐదేళ్ళ కారాగారశిక్ష విధిస్తూ పాటియాలా కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అలాగే ఇదే కేసులో సంబంధం ఉన్న మరో ముగ్గురికి కూడా కోర్టు శిక్షలను ఖరారు చేసింది. తొమ్మిదేళ్ళ క్రితం జరిగిన ఈ కేసులో ఎన్నో అవాంతరాల అనంతరం తుది తీర్పు వెలువడింది. సంపన్నులకు, నిరుపేదలకు మధ్య జరిగిన న్యాయపోరాటంగా ఈ కేసును పేర్కొన్న విషయం తెల్సిందే.

భారత నౌగాదళ మాజీ చీఫ్ ఎస్ఎం.నందా మనుమడైన సంజీవ్ నందా 1999 సంవత్సరం జనవరి తొమ్మిదో తేదీ ఉదయాన్నే మద్యం మత్తులో కారు నడిపాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన నిద్రపోతున్న వారిపై ఎక్కించడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. అయితే... కేసులో సరైన సాక్ష్యాధారాలు లేక పోవడంతో విచారణ సజావుగా సాగలేదు. అయితే ఒకే ఒకరు ఇచ్చిన సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని న్యాయమూర్తి తుది తీర్పు ఇచ్చారు.

ప్రధాన ముద్దాయి సంజీవ్ నందాకు ఐదేళ్లు జైలు శిక్ష విధించగా, మిగిలి ముగ్గురు దోషుల్లో ఒకరైన రాజీవ్ గుప్తాకు ఏడాది, మిగిలిన ఇద్దరికి ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించారు. కారుపై ఉన్న రక్తపు మరకలను చెరిపేసినందుకు గాను వ్యాపారవేత్త రాజీవ్‌ గుప్తా, సంజీవ్ నందా వద్ద ఉద్యోగులుగా పని చేసే భోలానాథ్, శ్యామ్ సింగ్‌లను దోషులుగా తేల్చారు.
మరిన్ని
సమరస పరిష్కారానికి సిద్ధం: మమత
చెన్నైకు చేరుకున్న ప్రధాని మన్మోహన్
మమతతో బెంగాల్ గవర్నర్ కీలక భేటీ
సింగూర్‌పై ఫలించిన గాంధీ మధ్యవర్తిత్వం
దేశాన్ని తప్పుదోవ పట్టించిన ప్రధాని: ఏచూరీ
సోనియా గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం!