తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా రైతుల సౌకర్యార్ధం 2,975 టన్నుల ఎరువులను కేటాయించినట్టు ఆ జిల్లా కలెక్టర్ టి.సౌండయ్య తెలిపారు. కావేరీ డెల్టా పారివాహక జిల్లాలలో ఒకటై తిరుచ్చిలో ఇటీవల ఎరువుల కొరత తలెత్తింది. దీంతో ఎరువుల కొరతను పరిష్కరించాలని ఆ జిల్లా రైతుల ప్రతినిధుల బృందం ఆ జిల్లా కలెక్టర్ టి.సౌండయ్యను కలిసి వినతి పత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో నెలకొన్న ఎరువుల కొరతను పరిష్కరించాల్సిందిగా గత నెలలో రైతులు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు రాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు కలెక్టర్ విజ్ఞప్తి చేసింది. జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ 2,975 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను కేటాయించినట్టు పేర్కొన్నారు.
జిల్లాకు కేటాయించిన ఎరువులను సహకార సొసైటీలు, ప్రైవేట్ ట్రేడర్ల ద్వారా రైతులకు సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం జాయింట్ డైరక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌ను పర్యవేక్షణాధికారిగా నియమించినట్టు జిల్లా కలెక్టర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు.
|