దేశ రాజధానితో సహా ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం రిక్టర్ స్కేల్‌లో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. మధ్యాహ్నం 11.20 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం ఆప్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాతంలో కేంద్రీకరించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర, పశ్చిమ భారత భూభాగాలతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్‌లోనే ఈ భూకంప ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. భూమధ్య రేఖాంశానికి ఉత్తరాన 36.7 డిగ్రీలు, తూర్పున 70.68 డిగ్రీల దూరంలో ఈ భూకంపం కేంద్రం నెలకొనిందని వాతావరణ శాఖ్ పేర్కొంది.
ఈ భూకంపం భూమి అడుగుభాగంలో 174 కిలోమీటర్ల లోతులో ఏర్పడిందని అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ఫలితంగా శ్రీనగర్, జమ్మూ, బద్రా, పూంచ్ మరియు చండీఘర్ ప్రాంతాల్లో భవంతుల ఊగిపోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు ఇళ్లనుంచి ఆఫీసుల నుంచి పరుగులు తీశారని అధికారిక సమాచారం. భూకంపానికి సంబంధించిన ప్రకంపనలు ఢిల్లీ వంటి నగరాల్లో కూడా ప్రతిధ్వనించాయని అధికారులు చెప్పారు.
పాకిస్తాన్‌లో లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, ముజఫరాబాద్, మలకండ్ తదితర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. రష్యాలోని తజికిస్తాన్‌లో కూడా ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
2005లో కూడా ఇదే ప్రాంతంలో భూకంపం సంభివించినప్పుడు వెయ్యి మంది ప్రజలు మృతి చెందగా అనేకమంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే.
ఈ భూకంప ప్రభావ ఫలితంగా ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు ఇప్పటివరకు తెలియలేదని అధికారులు తెలిపారు.
|