ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కేంద్రాన్ని నిధులు కోరిన పుదుచ్చేరి ప్రభుత్వం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కేంద్రాన్ని నిధులు కోరిన పుదుచ్చేరి ప్రభుత్వం
నిధుల సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని పుదుచ్చేరి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వి.వైద్యలింగం విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి వినతి పత్రం అందజేయాలని పుదువై కేబినెట్ నిర్ణయించింది. పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వి.వైద్యలింగం ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే.

ఆయన నేతృత్వంలో కొత్త కేబినెట్ తొలి సమావేశం శనివారం జరిగింది. ఇందులో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు మంత్రివర్యులతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఇన్‌ఛార్జ్), లెఫ్టినెంట్ గవర్నర్ కార్యదర్శి కుమారస్వామి, ఇతర ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.

ఇందులో రాష్ట్రంలో నెలకొన్న నిధుల కొరతపై ప్రధానంగా చర్చించారు. నిధుల కొరతను ఎదుర్కొంటున్న విభాగాలను గుర్తించి ఒక నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, వచ్చే వారంలో ముఖ్యమంత్రి వైద్యలింగం‌, ఆయన మంత్రివర్గ సహచరులు ఢిల్లీకి వెళ్లికి వెళ్లనున్నారు.
మరిన్ని
త్వరలో జనతాదళ్ (ఎస్) అభ్యర్థుల జాబితా
భారత్, పాకిస్తాన్‌లలో స్వల్ప భూకంపం
తిరుచ్చికి 2,975 టన్నుల ఎరువుల కేటాయింపు
నేడు కూడా కొనసాగనున్న సింగూర్ చర్చలు
మన్మోహన్‌కు డాక్టరేట్ పురస్కారం
సంజీవ్‌ నందాకు ఐదేళ్లు జైలుశిక్ష